డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 5 h ago
మాజీ ఎంపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సంబంధించి సీఐడీ కస్టడీలో చిత్రహింసల కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి అడ్డంకి ఎదురైంది. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా బాధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభావతిని ఏ5 గా పేర్కొన్నారు.